ఆ నింగే తల వంచదా తను పంచే అనురాగానికి . . ,
సంద్రం కూడా చిన్నబోదా తనలో దాచుకున్న కన్నీళ్ళకి . . ,
వెన్నెల దాసోహమవదా తన అందమైన ఆత్మీయతకి . . ,
కష్టములో కడవరకూ చేయూతనిస్తూ . . ,
మన సంతోషంలో సగభాగమౌతూ . . . . !
కన్నీరోస్తే తను కలత చెందుతూ . . ,
మన బాధల్లోనూ ఓదారుస్తూ . . . . !
తప్పులన్నిటిని సరి చేస్తూ . . ,
మన రేపటి పయనపు బాటలు వేస్తూ . . . . !
దేవుడు పంపిన వరమే అతను . . ,
మనకై వచ్చిన శశిధరుడే అతను . . . . !
మాటలకందని మనిషే అతను . . ,
మన మిత్రునకు జన్మదిన శుభాకాంక్షలు. . . .! ! !

Post a Comment